News Hunter : నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర అధ్యక్షతన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పోలిట్ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , మాజీ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో జగన్ ముఖ్యమంత్రిగా అయిన తరువాత నుండి ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దాడులు చేస్తున్నారన్నారు.
గ్రామ /వార్డ్ సచ్చివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలలో ప్రశ్న పత్రం ముందుగానే లీకేజ్ చేసి వై.సి.పి కార్యకర్తలకు ఉద్యోగాలు వచ్చే విధము పక్కా ప్రణాళిక రూపొందించి ప్రతిభ కలిగిన నిరుద్యోగులకు అన్యాయం చేసారని వై.సి.పి ఎం.పి విజయసాయి రెడ్డి గ్రామ సచ్చివాలయ ఉద్యోగలలో 90 శాతం వై.సి.పి కార్యకర్తలకు వచ్చాయని చెప్పడంతో ఈ పరీక్షలలో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్ధంఅవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ ఆంశంపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపించి ప్రతిభ కలిగిన వారికి అన్యాయం జరుగకుండా చూడాలన్నారు.
