ADS

header ads

వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ముగ్గురు అరెస్ట్

News Hunterనెల్లూరు రాంజీనగర్ 7వ వీధిలో ఉన్న ఎస్ఎస్ విల్లా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 201లో వ్యభిచారం జరుగుతుందని బాలాజీనగర్ పోలీసులకు సమాచారం రావడంతో. సిఐ సోమయ్య, ఎస్సైలు వీర ప్రతాప్, అంకమ్మలు తమ సిబ్బందితో కలిసి తెల్లవారు జామున ఆ నివాసంలో సోదాలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారణ అవడంతో,అక్కడున్న కల్లూరుపల్లికి చెందిన చక్కిరాల రామచంద్ర, వెంకటేశ్వరపురంకు చెందిన సూరాయపాళెం సుభాషిణి, రంగనాయకులపేటకు చెందిన సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ లను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం అక్కడకు తీసుకొచ్చిన 32 ఏళ్ల మహిళను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితులు ముగ్గుర్ని సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఇంట్లో లభించిన 13,760 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 8 కండోమ్ ప్యాకెట్లు స్వా ధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు .