ADS

header ads

గొంతులో చేప పడింది..

News Hunterగొంతులో పచ్చివెలక్కాయ పడింది అంటారు.. కానీ ఓ వ్యక్తి గొంతులో వెలక్కాయ కాదు చేప పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. పక్కి గ్రామానికి చెందిన సత్తివరపు పకీరు జాలరు వృత్తి చేస్తున్నాడు. గురువారం స్థానిక కాలువలో చేపలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఒక వగలమారి చేప అతనిపై కక్షగట్టింది. దాంతో అమాంతం ఫకీరు గొంతులోకి వెళ్ళింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా గొంతులోనే ఇరుక్కుపోయింది. దాంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతని పరిస్థితిని గమనించిన తోటిజాలర్లు..

పకీరును బొబ్బిలిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌ ఆర్నిపల్లి గోపీనాథ్‌.. పకీరు గొంతులోని చేపను కొంత మేర కత్తిరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు తీశారు. సకాలంలో పకీరును ఆసుపత్రికి తీసుకురావడం వలన ప్రమాదం తప్పిందని లేదంటే చేప పూర్తిగా గొంతులోకి దిగిపోయి శస్త్రచికిత్స చేయాల్సి ఉండేదని వారు చెప్పారు.