News Hunter : మనిషికి గుండె ఎడమ వైపున ఉంటుంది. కుడివైపున పిత్తాశయం ఉంటుందని టక్కున ఎవరడిగినా చెబుతారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం రివర్స్ లో ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషయం అతనికి కూడా తెలియదు. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ పాద్రౌనాకు చెందిన జమాలుద్దీన్ ఈ వింత సమస్యతో భాదపడుతున్నాడు. ఇవి మాత్రమే కాదు దాదాపుగా అతని శరీరంలో అన్ని అవయవాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు.
ఇటివల అతడు కడుపునొప్పి రావడంతో గోరఖ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతడికి వైద్యులు పలు రకాల వైద్య పరిక్షలు చేసి ఆశ్చర్యపోయారు. దీనిపైన అక్కడి వైద్యుల్లో ఒకరైన డాక్టర్ శశాంక్ దీక్షిత్ మాట్లాడుతూ "అతనికి పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లుగా మేము గుర్తించాము. కానీ అతడికి భిన్నంగా ఎడమ వైపున పిత్తాశయం ఉండటంతో ఆ రాళ్ళను తొలిగించడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. అతనికి గుండె కుడివైపున, కాలేయం ఎడమవైపున ఉన్నాయి. ఇలాంటి కేసును మేము ఎదురుకోవడం ఇదే తొలిసారి అని అయన చెప్పుకొచ్చాడు ..