నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కొత్తపాలెం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ రివర్స్ చేస్తూ వెనుక ఉన్న బైకు, ఐదు మందిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ధనుంజయ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా నెల్లూరులోని ఓ ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments