కోట మండల పరిధిలోని కొత్తపాలెం పంచాయతీ నెల్లూరుపల్లి హరిజనవాడకు చెందిన వేమాల వెంకటయ్య అన్నపూర్ణ దంపతులు తాము కట్టుబట్టలతో మిగిలాము, తమను ఆదుకోవాలంటూ బుధవారం తహసిల్దార్ పద్మావతికి, ఎంపీడీవో భవానికి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేరేవారికి చెందిన స్థలంలో పూరిగుడిసె వేసుకొని కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారమని ఈ క్రమంలో ఈనెల 11వ తేదీ రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాము నివాసం ఉంటున్న పూరిగుడెసికి మంటలు అంటుకోవడంతో ఇంటిలోని రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గుడ్డలు పూర్తిగా దగ్ధ మైపోయాయన్నారు. దీంతో తాము కట్టు బట్టలతో వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ముగ్గురు ఆడబిడ్డలని వారిలో పెద్ద కుమార్తె పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతుందని తమని ప్రభుత్వం ఆదుకొని ఇంటి నివేశన స్థలం, ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.

0 Comments