కోట మండలం,నెల్లూరు పల్లి కొత్తపాళెం దళితవాడ కు చెందిన వేమాల అన్నపూర్ణ,వెంకటయ్య దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. రోజు వారి కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు.వీరికి ముగ్గురు అడ బిడ్డలు11తేది శనివారం రాత్రి 9.30 నిముషాలు సమయంలో పూరి గుడిసెలో ముగ్గురు బిడ్డలతో నిద్రిస్తున్న వేళ ఉన్నట్లు ఉండి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి.వారు నివసిస్తున్న పూరి గుడిసె పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటనపై చలించిన సబ్ ఇన్స్పెక్టర్ తురక వెంకటరమణ ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన వేమాల అన్నపూర్ణ, వెంకటయ్య దంపతులకు ఎస్.ఐ తురక వెంకటరమణ గురువారం నెల్లూరు పల్లి కొత్తపాలెంలో తన వంతు ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన బాధితులకు అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు.వేమాల అన్నపూర్ణ,వెంకటయ్య దంపతులు కన్నీరు పర్యంతమై ఎస్సై గబ్బర్ సింగ్ కు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటరమణ వీరాభిమాని ఎస్.కె. సంధాని,అబ్రహం,మస్తాన్,ఎంపీటీసీ నారాయణ, సుబ్బయ్య, నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామ యువత పాల్గొన్నారు.

0 Comments