ADS

header ads

బ్రాందీ షాపులో నగదు గల్లంతు..!

 


మనుబోలు పంచాయతీ కోదండరాంపురం బీసీ కాలనీలో ప్రభుత్వ మద్యం దుకాణంలో 5లక్షలు గల్లంతయింది. అదే సమయంలో అక్కడ పని చేసే సేల్స్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఎక్సైజ్ ఎస్సైలు రంగంలోకి దిగారు. శనివారం శివరాత్రి ఆదివారం సెలవు రెండు రోజులు బ్యాంకులకు సెలవు ఇవ్వడంతో ఆ నగదు సోమవారం బ్యాంకులో జమ చేయాల్సి ఉంది. సోమవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయగా అక్కడ పని చేసే సేల్స్ బాయ్ అదృశ్యమైనట్లు తెలిసింది. సేల్స్ బాయ్ కి ఫోన్ చేయగా తన భార్యకు బాగా లేక నెల్లూరులో ఉన్నానని నేను వచ్చి కడతానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సూపర్వైజర్,  ఎక్సైజ్ అధికారులు టెన్షన్ లో ఉన్నారు. దీనిపైన విచారణ చేస్తున్నారు విచారిస్తున్నారు. ఇలాంటి సర్వసాధారణంగా మారాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మీడియా ప్రతినిధిలు అడగ గా సాయంత్రం నాలుగు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

Post a Comment

0 Comments