నెల్లూరు జిల్లా వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని అందజేసిన సర్వేపల్లి జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో 30 పంచాయతీలు ఏకగ్రీవమని వైసీపీ ప్రకటించుకుందని, ఇప్పటివరకు కూడా ఏకగ్రీవమైన 30 పంచాయితీలలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని. అందులో భాగంగా వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి పంచాయతీ కూడా ఉందని, ఏకగ్రీవమైన సర్వేపల్లి పంచాయతీలో అయితే ఎన్నో ఏళ్ల నుంచి కొత్తగుంట స్మశానాన్ని ఐదు కులాల వారు వినియోగించుకుంటున్నారు. స్మశానంలో శవాన్ని పూడ్చి పెట్టుకోవాలంటే వర్షాకాలంలో శవాన్ని తీసుకొని వెళ్లి పూడ్చుకోవాలంటే ఎంతో కష్టమైన పరిస్థితి. దీనికి కారణం స్మశానం లోతట్టులో ఉంది. దీన్ని పై గతంలో ఎన్నోసార్లు మండల కేంద్రంలోని అధికారులకు వినతిపత్రం రూపంలో జనసేన పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా గ్రావెల్ తోలుస్తామని చెప్పడం గాని, స్మశానాన్ని అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పలేదు. కొత్తగా వచ్చిన ఎమ్మార్వో కృష్ణ గారికి వినతి పత్రం అందజేశాం. వారు సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లో గ్రావెల్ తోలుకునే దానికి పర్మిషన్ గాని, లేదంటే ప్రభుత్వం నుంచే గ్రావెల్ తొలగించడం గాని చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలా జరగని పక్షంలో నిరాహారదీక్ష కైనా సరే దిగడానికి జనసేన పార్టీ సిద్దంగా వున్నాం.
ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, సుధాకర్, రహీం భాయ్ , అక్బర్ , వెంకయ్య, చిన్న , రహమాన్, తదితరులు పాల్గొన్నారు
0 Comments