ADS

header ads

తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడ నుకున్నా సంజు ప్రత్యక్షం.

తమ కుమారుడు ఇక లేడు ఇక ఎన్నడూ తిరిగి రాడు తప్పిపోయి అనంత లోకానికి వెళ్లిపోయాడా లేదా ఎవరు చెంతనైన ఉన్నాడా అప్పట్లో అధికారులంతా పది రోజులుగా శ్రమించి ముమ్మర పోలీసులు గాలింపుల చర్యలు కూడా తీసుకొని అనేక కోణాలలో ఆలోచన చేస్తూ శ్రమలు పడ్డారు దీనంతటికీ సినిమా సీనులా తలపించి16 నెలలకి తెరపడి దండు సంజు ప్రత్యక్షమయ్యాడు.నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 3 సంవత్సరాల బాలుడు దండు సంజు ప్రకాశం జిల్లా పామూరులో పత్యక్షం అయ్యాడు.తప్పిపోయిన తన కుమారుడు సంజు దొరకడం తో ఆ తల్లిదండ్రులు ఆనంద సాగరం లో మునిగి తేలిపోయారు. ఉయ్యాల పల్లి గ్రామానికి చెందిన దండు బుజయ్య, వరలక్ష్మి దంపతుల కుమారుడు దండు సంజు.3డేళ్ల వయస్సు లో తండ్రి బుజయ్య గొర్రెలను మేత కోసం అడివి లోనికి తోలుకెళ్లాడు. తండ్రి వెనుక సంజు ఏడుస్తూ వెంట వెళ్ళాడు. ఆ సందర్భంలో కుమారుడు వచ్చేది తండ్రి గమనించలేదు. మార్గం లో సంజు దారి తప్పి పోయాడు. గ్రామ సమీపంలో ఉన్న హై వే రోడ్డు పై ఏడిస్తూ ఉండగా కడప జిల్లా రాజంపేట కు చెందిన గిరిజనుడి ఆ బాలుడిని తీసుకెళ్లి కాలనీలో మద్యం మందుకు విక్రయించేశాడు ఈ నేపథ్యంలో బాలుడిని డబ్బులకి కొన్న గిరిజన కుటుంబం కూలీ పని కోసం ప్రకాశం జిల్లా పామూరు వద్దకు వారి వెంట తీసుకెళ్లారు తోపుగుంట గ్రామస్తుల ద్వారా వచ్చిన సమాచారం తో బాలుడి తల్లిదండ్రులు పామూరు కి వెళ్లి బాలుడిని తీసుక వచ్చారు.దీంతో 16నెలల క్రితం అదృశ్యం అయిన తన కుమారుడు దొరకడం తో ఆ తల్లిదండ్రులు ఆనందసాగరం లో మునిగి పోయారు. బాలుడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆ తల్లి కళ్ళల్లో ఆనంద్ ఉత్సాహంతో  అన్నం పెట్టింది.ఆ బాలుడిని చూసేందుకు ఉయ్యాలపల్లి గ్రామ ప్రజలు తండోప తండాలుగా వచ్చి అదృశ్యమైన బాలుడు సంజు ని తిలకించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు

Post a Comment

0 Comments