
తూర్పు రాయలసీమ పట్టభద్రుల యమ్.యల్.సి అభ్యర్థి అప్పంగారి జయపాల్ పరిచయం కార్యక్రమం గూడూరు నియోజకవర్గం కోట లో జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల పరిశీలక చైర్మన్ మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కోడివాక చందు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. కోడివాక చెందు మాట్లాడుతూ పట్టభద్రులు ఆమ్ ఆద్మీ పార్టీ విధి విధానాలు తెలుసుకోవాలని, ఢిల్లీ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ పాలన గుర్తించి అప్పంగారి జైపాల్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అప్పంగారి జైపాల్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారని, జైపాల్ సేవలు ఉపయోగించుకోవాలని గూడూరు నియోజకవర్గం పట్టభద్రుల కు మనవి. పట్టభద్రుల ఎం ఎల్ సి అభ్యర్థి జైపాల్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా ఎన్నికల్లో పోటీచేస్తున్నానని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే మీకు సేవ చేసుకుంటానని పట్టభద్రుల ఓటర్లు ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ ఆవుల వెంకటాద్రి, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి ప్రవీణ్ మరియు కోట మండలం కన్వీనర్ వావిళ్ళ ఏడుకొండలు, శివ, ధనుంజయలు మొదలగు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments