ADS

header ads

అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

News Hunter : - అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కాన్సాస్‌లో సాయుధులైన దుండగులు విరుచుకుపడ్డారు. పదుల సంఖ్యను లక్ష్యం చేసుకొని విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన దుండగుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

అమెరికాలోని కాన్సాస్ సిటీలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. మిస్సోరిలో ఉదయం 6 గంటలకు బార్‌లోకి చొరబడ్డారు. కాన్సాస్ సిటీలోకి పదో, సెంట్రల్వీధుల  గుండా దుండగులు వచ్చినట్టు గుర్తించారు. వారు నేరుగా బార్‌లోకి వచ్చారు. అక్కడ ఉన్న కొందరి లక్ష్యంగా కాల్పలు జరిపారు. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 6 గంటలకు కాల్పుల జరిగాయని పేర్కొన్నారు.

దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దుండగుల పారిపోయారని, సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పస్టంచేశారు.

అమెరికాలో నల్ల జాతీయులు లక్ష్యంగా శ్వేత జాతీయులు కాల్పులు జరపడం సాధారణం. ఇండియా, ఇతర దేశాల నుంచి వెళ్లినవారంటే వారికి ద్వేషం ఉంటుంది. ఇదివరకు శ్రీనివాస్ కూచిబొట్లను ఓ శ్వేత జాతియుడు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. శ్రీనివాసే కాక చాలామందిపై శ్వేత జాతియులు తమ అక్కసును వెళ్లగక్కారు.