ADS

header ads

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఓటు వేయడానికి సూచనలు

News Hunter Deask team :- Nellore

తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఉమ్మడి
( ప్రకాశం , నెల్లూరు , చిత్తూరు ) జిల్లాల బ్యాలెట్ లో ఓటు వేయడానికి సూచనలు జారీ చేశారు  :-

పోలింగ్ తేదీ 13 - 03 - 2023 సోమవారం ఉదయం 08:00గంటల నుండి 04:00సాయంత్రం వరుకు జరుగుతుంది

ఎలక్షన్ కమిషన్ సూచించిన ఏదైనా పోటో గుర్తింపు కార్డ్ తీసుకువెళ్ళాలి.( ఆధార్ , డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డు మొదలగున్నవి )

పోలింగ్ బూత్ లో ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి.

బ్యాలెట్ పేపర్ పై గుర్తులు ఉండవు.

పోటీల్లో ఉన్న అభ్యర్థలు పేర్లు మాత్రమే ఉంటాయి.

మన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న మొదటి గడి లో ( 1 ) నెంబరు వేయాలి.

హిందూ అరబిక్ సంఖ్యలు మాత్రమే వాడాలి.
( ఉదా" ....... 1 , 2 , 3 , 4 , 5....... )

తెలుగు అంకెలు , రోమన్ అంకెలు వాడితే ఓటు చెల్లదు.

బ్యాలెట్ పేపర్ పై సంతకాలు చేయడం , నిరసనలు తెలియచేయడం చేసినచో ఓటు చెల్లదు.

అభ్యర్థి పేరుకు ఎదురుగా {  ✅ or ❎  } గుర్తులు పెట్టరాదు.

1 తప్పని సరిగా వేయాలి , తర్వాత వేయకపోయిన  పర్వాలేదు.

1 వేయకుండా 2 , 3 వేస్తే ఆ ఓటు చెల్లదు.

రెండు పేర్లకు మధ్యలో సంఖ్య వేస్తే చెల్లదు.

ఒకే అంకె ఇద్దరికీ వేసిన ఓటు చెల్లదు.

బ్యాలెట్ పేపర్ ఏ ఒక్కరికి సంఖ్య గుర్తించక పోయినా ఓటు చెల్లదు..

Post a Comment

0 Comments