టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది.ఈ నేపథ్యంలో 2020 నాటికి 5జీ ఐఫోన్‌ను విడుదల చేస్తునట్టు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.ఈ దిశగా ఇప్పటికే ఇంటెల్ 8060 మోడెమ్స్‌ను తయారుచేసే పనిలో పడింది. ఈ మోడెమ్స్‌ను 5జీ ఐఫోన్లలో అమర్చి ఆపిల్ ఆ ఫోన్లను పరీక్షించనుంది.5జీ మోడెమ్ చిప్స్ కోసం గతంలో ఆపిల్ క్వాల్‌కామ్, మీడియాటెక్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ ఆ సంస్థ ఇంటెల్ వైపే మొగ్గు చూపిందికాగా మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లోనే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై 5జీ ఫోన్లు విడుదలవుతాయని తెలుస్తున్నది.

0 Comments