ADS

header ads

ప్రేమించలేదని 9వ తగతి విద్యార్థిని గొంతు కోసిన ఉపాద్యాయుడు

స్టూడెంట్స్ కు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే, చెడుదోవ పట్టాడు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించి, ఇందుకు అమె అంగీకరించకపోవడంతో గొంతు కోసిన ఘటన కర్నూలు జిల్లా బంగారుపేటలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్తే. దీంతో ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని శంకర్‌ను పట్టుకున్నారు. తర్వాత అతడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్న శంకర్‌ కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో సదరు విద్యార్థిని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్లి విద్యార్థిని గొంతుకోశాడు. అనంతరం, నిందితుడు అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు.ఉపాధ్యాయుడు ఇంట్లోకి ప్రవేశించి, దాడికి పాల్పడటంతో బాలిక పెద్దగా కేకలు వేసింది.

Post a Comment

0 Comments