ADS

header ads

నా పై ఎన్ని కేసులు పెట్టినా వినక్కి తగ్గేది లేదు..

News Hunter : కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నందుకు తనపై 39 అక్రమ కేసులు పెట్టారని, అయినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజల అండతో చివరిదాకా పోరాటం చేస్తానని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కొడంగల్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ రాకతో కోస్గి పునీతమైందన్నారు. తనను కొడంగల్‌ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారని తెలిపారు. 9ఏళ్ల క్రితం కొడంగలా.. వరంగలా అని అవమానించారని, ఢిల్లీ వరకు కొడంగల్‌ గళాన్ని వినిపించానని రేవంత్ చెప్పుకొచ్చారు. కురుక్షేత్రంలో ప్రజలే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ దగ్గర అధికారం, ధనం ఉంటే.. తమవైపు ధర్మం, న్యాయం ఉందన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని మరోసారి గెలవనీయని ఆయన స్పష్టం చేశారు. ఒక్కసారి వాళ్లు గెలిస్తే వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశాడని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌లా కుటుంబంలోఒకరికి కాదు..ముసలమ్మ, ముసలాయకు రెండు పెన్షన్లు రూ.4వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఇది కాంగ్రెస్‌ వాగ్ధానమని తెలిపారు. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని హస్తం గుర్తును గెలిపించండని కోరారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0 Comments