ADS

header ads

ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు

నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో 200 కుటుంబాలు చేరారు. పిడతాపోలూరు పంచాయతీ, జంగాల కండ్రిక గ్రామ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉధృతమవుతున్నాయి  చంద్రబాబు పై వ్యతిరేకత, జగన్ నాయకత్వంపై ఆసక్తి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించనున్నాయి.సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుపుకాదు, భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా పనిచేద్దాం. సాగునీటి సలహా మండలి సమావేశంలో అధికారులతో మాట్లాడి వెంటనే నీరు విడుదల చేయిస్తాం. ప్రజలకు చేరువలో ఉండి, చేతనైనంత సాయం అందించాలన్న తపన తప్ప, అధికారాన్ని , ప్రజలను అడ్డుపెట్టుకుని దోచుకోవాలన్న ఆలోచన నాకు లేదు  రాజకీయాలంటే ప్రజాసేవ అన్న విషయాన్ని విస్మరించి, అధికారం ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారు. అధికార పార్టీ వారి అవినీతిని అడ్డుకుంటే, అభివృద్ధిని అడ్డుకుంటు న్నారంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నా, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు కాపలాదారిగా వ్యవహరించి, అవినీతిని అడ్డుకుని తీరుతాం.పార్టీలో చేరిన 200 కుటుంబాల సభ్యులకు
అభినందనలు తెలియజేసారు. 

Post a Comment

0 Comments