ADS

header ads

తీర్పు చెప్పాల్సిన జడ్జీ.. బోనులో నిలబడ్డాడు..

నిందితులకు తీర్పు చెప్పి శిక్ష విధించాల్సిన న్యాయమూర్తే ఇప్పుడు బోనులో నిలచోనున్నాడు. మరో జడ్జి ఆయన చేసిన పనికి తీర్పు ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి వి.వరప్రసాద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. దీంతో వరప్రసాద్‌ను అరెస్టు చేసి తాను జడ్జిగా వ్యవహరించే కోర్టులోనే పోలీసులు ప్రవేశపెట్టారు. దీంతో ఆయన్ను 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వరప్రసాద్‌ను చంచల్‌గుడా జైలుకు తరలించారు.
వరప్రసాద్ ఆస్తులపై సోదాలు నిర్వహించగా ఆయన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ. 3 కోట్లు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై పలు సెక్షన్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం వరప్రసాద్ నివాసంపై దాడులు చేసింది ఏసీబీ. గురువారం ఉదయం వరకు సోదాలు జరిగాయి. ఆ తర్వతే వరప్రసాద్‌ను అరెస్టు చేశారు. సోదాలు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా జరిగాయి.

Post a Comment

0 Comments