ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కేంద్రం చేసిన మోసం, వంచన పై చేస్తున్న ధర్మ పోరాట దీక్ష లో భాగంగా ఈ నెలా 10 వ తేది న నగరం లోని ఎన్.టి.ర్ నగర్ SVGS కాలేజీ ప్రాంగణంలో ధర్మ పోరాట దీక్ష నిర్వ హించనున్నారు. ఈ దీక్ష కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర తెలియజేసారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా,మంత్రులు,ఎంయల్ఏలు, నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నారు, జిల్లాలోని మంత్రులు,ఎంయల్ఏలు, నాయకులు,కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.

0 Comments