ADS

header ads

మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

NEWS HUNTER : హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం మెట్రో స్టేషన్‌కు వచ్చిన ఆ వ్యక్తి పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే... ఆ వ్యక్తి వివరాలు తెలియరాలేదు. సమాచారమందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Post a Comment

0 Comments