ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అనూహ్యంగా దాడి దిగాడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది. పావుకేజీ కారప్పొడి పొట్లంతో అనిల్ కుమార్ అనే వ్యక్తి సచివాలయంలోకి దూసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారం జల్లినట్టు వెల్లడించారు. సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో దీంతో కేజ్రీవాల్ కళ్లజోడు పగిలిపోయింది.
నిందితుడు అనిల్ కుమార్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అనిల్ కుమార్ భార్య సెక్రటేరియట్‌లోనే పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. కాగా అతడు సీఎంపై ఎందుకు దాడికి దిగాడన్నది ఇంకా తెలియరాలేదు. కాగా ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని ఆమాద్మీ పార్టీ విమర్శించింది. అత్యంత ‘ప్రమాదకరమైన’ ఈ దాడిపై ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలని ఆమాద్మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్నారా అని మీడియా ఆయనను ప్రశ్నించగా.. రాజకీయంగా తాము బురద జల్లబోమని పేర్కొన్నారు.

0 Comments