ADS

header ads

ధర్మంకోసం,న్యాయం కోసం పారాడుతా నేను ఎవరికి భయపడను - చంద్రబాబు

కేంద్రం విభజనచట్టం అమలు చేయలేదు. ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయిస్తోంది. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం. అడుక్కుంటే లాభం లేదు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి మనది. మనది ఒక వ్యవస్థ. దేశానికి సమస్య వచ్చినప్పుడు దారి చూపే పార్టీ మనది. ధర్మంకోసం, న్యాయం కోసం పారాడుతాం. ఎవరికి భయపడను ' అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
మార్టూరు మండలం డేగరమూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శినికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగామాట్లాడుతూ సీబీఎన్‌ ఆర్మీ బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నారు. వ చ్చే ఎన్నికలు ఏకపక్షం గా ఉం డాలి. కోడికత్తి, జెల్లికట్టు, పోలవ రం కాలువలు తెగొట్టడం, అసెంబ్లీకి రాకపోవటం, పార్లమెంట్‌లో రాజీనామాలు చేయటం మనకు తయారైన ప్రతిపక్షం పని అన్నారు. ఓటు వేసే బాధ్యత మీది...జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు.

Post a Comment

0 Comments