ADS

header ads

పవన్ కళ్యాణ్ నిర్ణయం తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరమై , రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ రాజకీయాలతోనే గడుపుతాడని , సినిమాల జోలికి వెళ్లాడని అంత ఫిక్స్ అయ్యారు. కానీ తాజాగా పవన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. తన రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఓ సినిమా ను చేయాలనీ చూస్తున్నాడట.

అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నికలకు ముందు చేసిన నాదేశం లాంటి సినిమాల మాదిరే ప్రస్తుత రాజకీయాలపై అవగాహన వచ్చేలా.. పార్టీకి పనికొచ్చేలా ఈ మధ్యే పవన్ ఓ స్క్రిప్ట్ విన్నాడని, అది బాగా నచ్చడం తో సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడట. ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు సినిమాలు చేయకూడదని అనుకున్నా కూడా ఇప్పుడు మాత్రం మనసు మార్చుకుని ఎన్నికలకు ముందే ఈ చిత్రం చేయాలనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియకపోయినా.. నిర్మాత మాత్రం ఖరారు అయ్యాడని ప్రచారం జరుగుతుంది.రవితేజ తో నేలటికెట్టు చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త ఫై క్లారిటీ రావాల్సి ఉంది.

Post a Comment

0 Comments