News Hunter :వ్యవసాయ క్షేత్రం వద్ద జరిగిన ఇద్దరు రైతుల మధ్య జరిగిన బోరు తగాదాలో ఓ రైతు మృతి చెందగా మరోవ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని రాంపురంతండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాంపురం తండాకు చెందిన అంగోత్ హేమ్ల(60), అంగోతు సైదులు ఇద్దరివి పక్కపక్క పొలం గెట్లు. వ్యవసాయ పొలంలో కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య బోరు తగాద కొనసాగుతుంది. హేమ్ల బోరు దగ్గర్లో అంగోత్ సైదులు భూమిలో బోరువేసేందుకు యత్నించాడు. విషయం తెలుసుకున్న అంగోతు హేమ్ల అతడి కుమారుడు ఉపేందర్‌తో కలిసి పొలం వద్దకు వెళ్లి బోరు ఇక్కడ బోరువేయవద్దని వారించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో సైదులుతో పాటు అతడి వెంట వచ్చిన మరో 5గురు అంగోత్ హేమ్లా, అతడి కుమారుడు ఉపేందర్‌పై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి సైదులు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు ఉపేందర్‌కు తీవ్రగాయాలయ్యా యి. ఉపేందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్‌కు తరలించారు. మృతుడికి భార్య కుమారులు ఉన్నారు.హేమ్లా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్ తెలిపారు.

0 Comments