ADS

header ads

ఫేస్‌బుక్ ద్వార పరిచయమైన 13 ఏళ్ల బాలికను హోటల్ గదికి తీసుకువెళ్లి..?

News Hunter : ఫేస్‌బుక్ ద్వార పరిచయమైన యువకుడు 13 ఏళ్ల బాలికను హోటల్ గదికి తీసుకువెళ్లి ఆమెపై తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన యూపీలోని మీరట్ నగరంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ లోని దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఓ యువకుడితో ఏడాదికాలంగా ఫేస్‌బుక్ ఛాటింగ్ చేస్తోంది. ఆ స్నేహంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనంతరం  ఆ అమ్మాయి ట్యూషన్ కు వెళుతున్నానని చెప్పి వచ్చి తన స్నేహితుడిని కలిసింది. యువకుడు బాలికను లాంగ్ డ్రైవ్ కు మీరట్ తీసుకువెళ్లి అక్కడి హోటల్ లో ఉంచాడు. యువకుడు తన స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేశాడు. హోటల్ గదిలో యువకుల బారి నుంచి బయటపడిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని డీసీపీ మణిదీప్ సింగ్ చెప్పారు.