ADS

header ads

స్కూల్ బస్ లోయలో పడి 16 మంది చిన్నారులు మృతి

News Hunter : విహారయాత్రకు వెళ్లిన స్కూల్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నేపాల్‌లో డాంగ్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మహిళలతో సహా 16 మంది విద్యార్థులు మరణించినట్లు అధికారులు తెలియజేసారు.
వీరంతా గోరానిలోని క్రిష్ణసేన్ ఇచ్చుక్ టెక్నికల్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదంపై స్పందించిన అధికారులు క్షతగాత్రులను సమీప రప్తి జోనల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారు.