ADS

header ads

ఈ నెల 29 తర్వాత టీవీ ఛానెల్స్ ఆగవు..

News Hunter : ఈ నెల 29 నుంచి కొత్త కేబుల్‌ నిబంధనలు అమలులోనికి రానున్నాయి. ఇకపై ఎంపిక చేసుకొన్న ఛానెల్స్ కి మాత్రమే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏయే టీవీ ఛానెల్స్ ఎంత రేటు ? అన్నది టీవీ ఛానెల్స్, వార్త పత్రికల ద్వారా కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు ఛానెల్స్ ప్యాకేజ్ ఎంచుకొంటే రూ. 283 చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త కేబుల్‌ నిబంధనలు అమలులోనికి రాబోతున్న నేపథ్యంలో ఈ నెల 29 తర్వాత సబ్‌స్రైబ్డ్‌ చానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ ప్రచారంపై టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్‌) స్పందించింది. ఈ నెల 29 తర్వాత ఏ ఛానెల్ ఆగిపోదు. ఈ మేరకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశాం. ప్రతి వినియోగదారుడికి ఇష్టమైన చానళ్లను ఎంపిక చేసుకోవడానికి తగు సమయం ఉంటుందని తెలిపింది.