నెల్లూరు జిల్లా శ్రీహరి కోటాలో భారత అంతరిక్ష పరిశోదనా సంస్థ ఇస్రో వరుస ప్రయోగాలతో దూసుకెళుతోంది. నెల వ్యవధిలోనే మూడు ప్రతిష్టాత్మక ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రం నుంచి నింగిలోకి జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని పంపింది. ఈ ఉపగ్రహం నింగిలోకి పంపడం ద్వారా సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. 2250 కిలోల బరువున్న జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఎయిర్ ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరం కానుంది. భారత వాయుసేనకు 70 శాతం సేవలు అందించనుండగా... భారత ఆర్మీకి 30శాతం సేవలు అందించనుంది.
