ADS

header ads

9 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏఈ కృష్ణారావు..?

News Hunter : ఏసీబీ దాడులు చేసి అవినీతి పరులను పట్టుకుంటున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు డబ్బే మాకు ముఖ్యం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. కృష్ణా జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది . రూ. 9 వేలు లంచం తీసుకుంటూ ముసునూరు పంచాయతీరాజ్‌ ఇంఛార్జ్‌ ఏఈ కృష్ణారావు ఏసీబీకి పట్టుబడ్డాడు. నూజివీడు పంచాయతీరాజ్‌ ఏఈ కార్యాలయంలో గద్దె రఘుబాబు నుంచి లంచం తీసుకుంటుండగా కృష్ణారావును పట్టుకున్నారు. రూ. 2 లక్షల బిల్లు మంజూరు చేసేందుకు రఘుబాబు నుంచి కృష్ణారావు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చుకోలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపన్నీ పంచాయతీరాజ్‌ ఏఈని పట్టుకున్నారు.