ADS

header ads

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ని కాన్వాయ్ లో ఆస్పత్రికి పంపిన మంత్రి సోమిరెడ్డి..!

News Hunter : మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు-ముత్తుకూరు రోడ్డులోని ఆకుతోట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డారు. అటుగా వెళ్తున్న మంత్రి సోమిరెడ్డి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కలివెలపాళేనికి చెందిన పరంధామయ్యగా గుర్తించారు.ఆపదలో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి పంపి సాయం చేసిన మంత్రి సోమిరెడ్డికి  పరంధామయ్య కుమారుడు రమేష్ ధన్యవాదములు తెలియజేసాడు.

Post a Comment

0 Comments