News Hunter : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోషల్ జస్టిస్ రాష్ట్ర కో కన్వినర్ ఆధర్యంలో నెల్లూరు లోని 10 నియోజిక వర్గాలకు సోషల్ జస్టిస్ కన్వీనర్ల నియమించారని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియాసమావేశంలో ఆ పార్టీ సేవదళ్ కో ఆర్డినేటర్ పి. టోనీబాబు తెలియజేసారు. రాష్ట్ర కన్వినర్ సభ్యులుగా రాజా యాదవ్, జిల్లా కన్వినర్ గా రోజా రాణి, జిల్లా కో కానివినేర్ గా కే.సంజయ్ నియమితులయ్యారని తెలియజేసారు. ఈ సోషల్ జస్టిస్ కన్వీనర్లు సమాజం లోని అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేందుకు ప్రతి గ్రామాలకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్రియ శీలక పాత్ర పోషిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రాజా యాదవ్, సంజయ్,రోజా రాణి, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments