ADS

header ads

అందంగా అలంకరించిన కారులో.. ఎర్ర చందనం స్మగ్లింగ్..

News Hunter : టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. కారులో తరలించేందుకు సిద్ధమైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌  ఆర్‌ఎస్‌ఐ వాసు కథనం మేరకు.. రేణిగుంట్ల సమీపంలోని తిరుమల నగర్‌ వద్ద సోమవారం రాత్రి కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు పెళ్లి కారు కనిపించింది. ఇది పెళ్లిళ్ల సీజన్‌ కాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. పెళ్లి పేరుతో అందంగా అలంకరించిన కారులో స్మగ్లింగ్‌ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్‌, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు.