ADS

header ads

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న శ్వేతా బసు

News Hunter : కొత్త బంగారు లోకం చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. మొదటి చిత్రం తోనే యూత్ ను ట్టిపడేసిన ఈ భామ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి వార్తల్లో నిలిచింది. అప్పటి నుండి కనిపించకుండా పోయిన ఈ భామ.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ గా ఉన్న సమయంలో రోహిత్ మిట్టల్ తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరి వివాహ నిశ్చితార్థం గత సంవత్సరంలోనే జరుగగా, ఇంతకాలం ఈ విషయం తెలుపకుండా సైలెంట్ గా ఉన్న శ్వేత బసు తాజాగా పెళ్లి కూడా చాలా సైలెంట్ గా చేసుకుంది. ఈ జంట నిన్న పెళ్లితో ఒక్కటి అయ్యారు. అతి కొద్ది మంది బందు మిత్రుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది.

Post a Comment

0 Comments