ADS

header ads

నారా లోకేష్ కల కార్యరూపం దాల్చనుంది..?

News Hunter : త్వరలోనే మంత్రి నారా లోకేష్ కల సాకారం కానుంది. ఇంటింటికీ కుళాయి ద్వారా ఉచిత తాగునీరు అందించేలా లోకేష్ రూపొందించిన పథకం కార్యరూపం దాల్చనుంది. ఇందుకోసం రూ.22,300 కోట్లు కేటాయించింది. ఈ బృహత్తర కార్యక్రమానికి జలధారగా నామకరణం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా జలధార ముఖ్య ఉద్దేశాన్ని లోకేష్ వివరించారు. జలధార తన కల అని లోకేష్ చెప్పారు. జలధార పథకం అనేది ఎప్పటినుంచో తన మదిలో మెదులుతున్న ఆలోచన అని తెలిపారు. పల్లెల్లో తాగునీటి సమస్యలు శాశ్వతంగా పోవాలనే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఏళ్ల నాటి తన కల త్వరలో సాధ్యం కానుందన్నారు. ప్రతీ ఇంటి కుళాయిలో జలకళగా జలధారలు వర్షించేందుకు సహకరిస్తున్న ప్రభుత్వం, అధికారులు, సిబ్బంది, నిపుణులకు లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments