ADS

header ads

చంద్రబాబు శ్వేతపత్రంపై రామకృష్ణ విమర్శలు

News Hunter : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేసిన ఐదో శ్వేతపత్రంపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. శ్వేతపత్రం విడుదల చేస్తూ వ్యవసాయరంగ సంక్షోభం తీర్చామని చంద్రబాబు చెప్పడం 'జోక్ ఆఫ్ ది ఇయర్' అని సీపీఐ నేత రామకృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన రైతు రుణ మాఫీ 4, 5 విడతలు ఇప్పటివరకు చేయలేదు, రాష్ట్రంలో 347 మండలాలను కరువుగా ప్రకటించిన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందని రామకృష్ణ మండిపడ్డారు.