గూడూరు : సైదాపురం మండలం పోతేగుంట గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు రాపూరు డిపోకు చెందిన బస్సుపై రాళ్ళ వర్షం కురిపించాడు. దీంతో బస్సు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.వివరాల్లోకి వెళితే,ప్రతిరోజులాగే రాపూరు డిపోకు చెందిన బస్సు పోతేగుంట గ్రామానికి వెళ్లి,తిరిగి వస్తుండగా, సురేష్ అనే యువకుడు పురుగు మందులు పిచికారీ చేసే,స్ప్రేయర్ మెషిన్ ను,అతనితో పాటు తీసుకుని బస్సులో ఎక్కాడు.దీనిని గమనించిన బస్సు డ్రైవర్ మరియు కండెక్టర్, ఆ పరికరాన్ని తీసుకురకూడదని యువకుడికి చెప్పడంతో ఆగ్రహించిన యువకుడు,రాళ్లతో బస్సు పై,దాడి చేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన బస్సు సిబ్బంది,సైదాపురం పోలీసులకు పిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
