News Hunter : చలి నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో కుంపటి వేస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్. రెండు రోజుల్లో ఆరుగుర్ని కుంపటి పొగ బలిగొంది. జూబ్లీహిల్స్ లో తల్లికొడుకులు ప్రాణాలు కొల్పోతే.. గ్రేటర్ శివారులో నలుగురు యువకులు గదిలోనే పొగతో ఊపిరాడక మృతి చెందారు.
ఇంట్లో రాజేసే కుంపటి ప్రాణాలు తీస్తోంది. అవును.. వేడి కోసం మీరు గదిలో వేసుకునే చలిమంటే మృత్యువుగా మారుతోంది. గదిని వెచ్చగా ఉంచుదామని కిటికీలన్నీ వేసి… బొగ్గుల పొయ్యి పెట్టుకున్నారో ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే. బొగ్గుల కుంపటి నుంచి వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ఆయువు తీయటం ఖాయం.
చలికాలంలో ఇంటిముందు చలిమంటలు ఓ అనుభూతి. సిటీ లైఫ్ లో ఆ నేచర్ హీటర్ కు అవకాశాలు తక్కువే. ఇరుకు ఇళ్లలో చలిమంటకు ఛాన్సే లేదు. అయితే..కొద్ది రోజులుగా హైదరాబాద్ లో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగిపోవటంతో..కొందరు ఇంట్లోనే బొగ్గుల కుంపటి పెట్టుకుంటున్నారు. గది వెచ్చగా ఉంచుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రాణాలతో చెలగాటంగా మారుతోంది. వెచ్చగా పడుకుంటున్నామని అనుకున్నవాళ్ల బతుకులు తెల్లారే సరికి తెల్లారిపోతున్నాయి.
గత రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 25లో తల్లి కొడుకులు బుచ్చివేణి, ధర్మరాజు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు. చలిగాలి గదిలోకి రాకుండా తలుపులు, కిటీకీలు వేశారు. బొగ్గు పొగ గదిలో వ్యాపించి ఇద్దరూ స్పృహ కోల్పోయారు. కాసేపటికే మృతి చెందారు.
గ్రేటర్ శివారులోని శామీర్ పేట మండలం బొమ్మరాశిపేటలో కూడా నలుగురు యువకులు కుంపటి పొగకు చనిపోయారు. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సతీష్ గౌడ్, అరవింద్ గౌడ్, మహేశ్ ముదిరాజ్, మహేందర్ రెడ్డి గా గుర్తించారు. మృతుల్లో ఒకడైన అరవింద్ గౌడ్, మిత్రుడు క్రాంతి కలిసి స్థలం లీజుకు తీసుకొని ఫామ్ ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం అందులో పార్టీ చేసుకున్నారు. పార్టీ అవగానే క్రాంతి అక్కడి నుంచి వెళ్లపోగా మిగిలిన నలుగురు గదిలో కుంపటి వేసుకొని పడుకున్నారు. పొగ గది నిండా వ్యాపించటంతో వారికి శ్వాస ఆడలేదు. నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందారు. మృతులంతా 25 ఏళ్లలోపు వారే. చేతికొచ్చిన బిడ్డల మృతి వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
చలి నుంచి కాపాడుకునేందుకు వేసుకుంటున్న కుంపటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. బొగ్గు నుంచి వచ్చే కార్బన్ డై యాక్సైడ్ గది నిండా వ్యాపిస్తే.. తొలుత మనిషి స్పృహ కోల్పోతాడు. ఆక్సీజన్ అందక కొద్దిక్షణాల్లోనే చనిపోతారు. చాలావరకు నిద్రపోయే సమయంలోనే కుంపటి వెలిగిస్తారు కాబట్టి.. తప్పించుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.