NEWS HUNTER : నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలం పిడతాపోలూరు వడ్డిపాళేనికి చెందిన 25 వైకాపా కుటుంబాలు, వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ ఎర్రగుంటకు చెందిన 30 వైకాపా కుటుంబాలు టీడీపీలో చేరారు.
అందరికీ తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
పార్టీలో చేరిన వారిలో వడ్డిపాళేనికి చెందిన మన్నూరు వెంకయ్య, మన్నూరు అశోక్, నెల్లూరు శ్రీనివాసులు, వలిపి చిన ముత్యాలు, వలిపి పెద ముత్యాలు, నెల్లూరు చిన్నయ్, చెరువుపల్లి పిచ్చయ్య, ముసునూరు కొండయ్య తదితరులు
ఎర్రగుంటకు చెందిన వలిపి రమణయ్య, సంపూర్ణమ్మ, చల్లా కృష్ణయ్య, వలిపి శీనయ్య, బెల్లంకొండ కుమార్, వలిపి ప్రసాద్, ఏడుకొండలు, తురకా వెంకటేశ్వర్లు తదితరులు..
