NEWS HUNTER : బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కోసం ప్రముఖ సినీ హీరో రామ్‌చరణ్‌ రెండు రోజలు పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం రాత్రికే విజయవాడ చేరుకుని, ఆదివారం, సోమవారాల్లో రెండు రోజుల పాటు జనసేన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తారు. భీమవరం, గాజువాక, పెందుర్తి, నర్సాపురం లోక్‌సభ స్దానాలతో పాటు పలు చోట్ల జరిగే సభల్లో రాంచరణ్‌ పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.ఇప్పటికే నాగాబాబు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తనయుడు , ప్రముఖ సినీ హీరో వరుణ్‌తేజ్‌,కుమార్తె ప్రచారం చేస్తున్న సంగతి విధితమే. రామ్‌చరణ్‌ రాకతో జనసేన అభ్యర్ధుల ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంటోంది.