News Hunter (Nellore) : - నగరంలోని భవాని ప్రెసిడెన్సీ లో ఆ సంఘ అధ్యక్షులు ఎడ్లూరు విల్సన్ అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఏపీ జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పా రవీంద్ర నాయకత్వంలో ఏపీ జేఏసీ అమరావతి నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులు, 59 సంఘాల ఉద్యోగ ప్రతినిధులు, ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా నాయకులు ,తాలూకా ప్రతినిధులు 36 మంది, అన్ని సంఘాలకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లో సభ్యత్వం తీసుకోవడం జరిగింది.
