NEWS HUNTER : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు గా నెల్లూరు కి చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి శనివారం ఉదయం తిరుమల చేరుకున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముందుగా దర్శించుకొని అనంతరం టిటిడి పాలక మండలి సభ్యురాలు గా ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి జేఈవో అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవం లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సన్నిధిలో సేవచేసే భాగ్యం కలుగడం తన పూర్వ జన్మ సుకృతం అని ప్రశాంతి రెడ్డి అన్నారు. తిరుమల ప్రతిష్ఠ పెంచేలా ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం సులువుగా జరిగేలా పాలక మండలి సభ్యులతో కలిసి పనిచేస్తానని టిటిడి బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
