News Hunter : షియోమి ఇండియా ఈ రోజు మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 8 ఎను విడుదల చేసింది. ఇండియాలో మిడ్-రేంజ్ విభాగంలో స్మార్ట్‌ఫోన్‌లకు గల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని షియోమి ఇప్పటికే రెడ్‌మి 7 ఎ ను విడుదల చేసింది. ఇప్పుడు దీని కన్నా మెరుగైన ఫీచర్లతో రెడ్‌మి 8 ఎ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.
షియోమి ఇండియా రెడ్‌మి 8 ఎ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్ లలో అందిస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.6,499. అలాగే 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 6,999 రూపాయలుగా షియోమి ప్రకటించింది.
రెడ్‌మి 8A 1.95 GHz, క్వాడ్-కోర్ కార్టెక్స్ A53 కోర్ 1.45 GHz, క్వాడ్-కోర్ కార్టెక్స్ A53 తో కలిపి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. చిప్‌సెట్ విభాగంలో ఇది 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. మైక్రో SD కార్డ్ ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఫోన్ USB టైప్-సి పోర్ట్‌తో వస్తుంది.
రెడ్‌మి 8 ఎ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి సెప్టెంబర్ 29 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో, mi.com మరియు Mi హోమ్ స్టోర్లు మరియు ఇతర ఆఫ్‌లైన్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 29 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాన్ని నిర్వహించనుంది.