ADS

header ads

ఎస్.ఏ.పి స్టేక్ హోల్డర్స్ అవగాహన సదస్సు 2020


News Hunter : హైదరాబాద్ లోని  అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ సొసైటీ, మాయాబజార్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్ ఏ పి స్టేక్ హోల్డర్స్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన భాగస్వాముల అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా పర్యాటక రంగం భాగస్వాములు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అమల అక్కినేని గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వచ్ఛత కార్మికులు రాష్ట్రానికి, దేశానికి వెనుముక లాంటి వారు అని పేర్కొన్నారు, వారి కృషి తోనే నేడు ప్రతి పర్యాటక ప్రదేశం ఎంతో ఆదరణ పొందుతున్నాయి అని అన్నారు.. భవిష్యత్తులో మరిన్ని స్వచ్చత కార్యక్రమాలు తమ స్వచ్చంధ సంస్థల నుంచి నిర్విహిన్చనున్నట్లు తెలియజేశారు.

వినోద్ కుమార్ పువ్వాడి (SAP ప్రాజెక్ట్ అసోసియేట్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, GoI) పర్యాటక పరిసరాలు శుభ్రంగా ఉంటేనే దేశం అభివృధి సాధిస్తుంది అని పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ యొక్క లక్ష్యాలను కూడా వారితో పంచుకున్నారు.

సత్తరుపా దత్త (అసిస్టెంట్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్రం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, GOI )వారు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్క పర్యటకుడి బాధ్యత అని తెలియజేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అనేక అంశాలను విశ్లేషించి సభ్యులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ అందించిన స్వచతా మూవీ చూపబడింది మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, GOI వారి బహుమతులను  అందించబడ్డాయి.

 ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిలు గా
అక్కినేని అమల - వ్యవస్థాపకురాలు, బ్లూ క్రాస్ సొసైటీ, హైదరాబాద్. 
సతరూప దత్తా - అసిస్టెంట్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్రం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, GOI. పాల్గొన్నారు

నిపుణుల వక్త డాక్టర్ విజయ రాఘవ టి (నంది అవార్డు గ్రహీత) - ప్రొఫెసర్ AISFM.డాక్టర్ అనురాధ - ప్రొఫెసర్, యుసిడబ్ల్యు పాల్గొన్నారు.


SAP సభ్యులు మిస్టర్ వినోద్ కుమార్ పువ్వాడి - SAP ప్రాజెక్ట్ అసోసియేట్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, GoI, మిస్టర్ నరేష్ ఎన్ - AAO, ఐఐటిటిఎం సౌత్
మిస్టర్ సురేంద్ర రెడ్డి ఇ - అటెండర్, ఐఐటిటిఎం సౌత్ తదితరులు పాల్గొన్నారు.